‘దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని విజ్ఞప్తి’

27 Apr, 2020 13:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌కు సంబంధించి అనేక సడలింపులు ఇచ్చామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెడ్‌జోన్‌, హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో పరిశ్రమలు, దుకాణాలు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం అనుమతిచ్చిందని, వ్యవసాయ పనులకు కూడా సడలింపులు ఇచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకుంటున్నారని తెలిపారు. 8 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని, మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. (లాక్‌డౌన్‌ ఎత్తివేత: ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు )

దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, లాక్‌డౌన్‌ ఎత్తివేసినా రెండు నెలల వరకు జాగ్రత్తలు పాటించాలి కిషన్‌రెడ్డి సూచించారు. మాస్కులు లేకుండా ఏ ఒక్కరూ బయటకు రాకూడదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరగబోతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మూడున్నర ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు మన దగ్గర ఉన్నాయని, కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులను ఎలా దాచుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. (‘మహిళల తప్పులవల్లే కరోనా వ్యాప్తి’ )

అత‌ని వ‌ల్లే అన్నీ కోల్పోయా: ర‌కుల్‌

మరిన్ని వార్తలు