జియో సిమ్ కోసం కిలోమీటర్ల క్యూ!

4 Sep, 2016 13:02 IST|Sakshi
జియో సిమ్ కోసం కిలోమీటర్ల క్యూ!

టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందుబాటులోకి వచ్చిన నెట్ వర్క్ సేవలు రిలయన్స్ జియో. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ విన్నా రిలయన్స్ జియో మాట వినిపిస్తోంది. కారణం.. రిలయన్స్ సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద డిసెంబర్ 31 వరకూ ఆఫర్ కింద ఉచిత్ సిమ్ తో పాటు అపరిమిత ఇంటర్ నెట్ డేటా, వాయిస్ కాల్స్ సదుపాయం కల్పించడం.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో స్టార్ట్ ఫోన్ యూజర్లకు జియో సిమ్ ఫీవర్ పట్టుకుంది. రిలయన్స్ జియో సిమ్ కోసం అప్లై చేసుకోవడానికి చాలా షాపుల ముందు దాదాపు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. దీంతో చాలా ప్రాంతాల్లో అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సిమ్లు అందుబాటులోకి వచ్చిన చాలా నగరాలు, పట్టణాలలో రిలయన్స్ డిజిటల్స్, సిమ్ విక్రయించే షాపుల ముందు కస్టమర్లు బారులు తీరుతున్నారు. జనవరి 1 నుంచి పరిస్థితి ఎలా ఉంటుందన్నది పక్కనబెడితే జియో మాత్రం ఇతర పోటీ కంపెనీలతో పాటు స్మార్ట్ ఫోన్ యూజర్లపైనా ప్రభావం చూపించిందన్నది వాస్తవం.

మరిన్ని వార్తలు