కొల్హాపురి చెప్పులకు అరుదైన ఘనత

19 Jun, 2019 20:24 IST|Sakshi

ముంబై : సాంప్రదాయ పాదరక్షలు అనగానే గుర్తొచ్చేది కొల్హాపురి చెప్పులు. దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్‌కు తాజాగా జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ లభించింది. జీఐ ట్యాగ్‌ లభించడం ద్వారా కొల్హాపురి చెప్పుల మార్కెట్‌ మరింతగా పెరగనుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, షోలాపూర్‌, సంగ్లీ, సతారా, కర్ణాటకలోని ధార్వాడ్, బెల్గామ్‌, బగల్‌కోట్, బీజాపూర్‌ జిల్లాలను కొల్హాపురి చెప్పుల మూల స్థానంగా పేర్కొన్నారు. నిర్ధిష్ట భూగోళ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వాటికి ఈ జీఐ ట్యాగ్‌ని అందజేస్తారు. ఇది మరో చోట ఉత్పత్తి కాదని అర్థం. ఈ ట్యాగ్ క్వాలిటీని కూడా సూచిస్తుంది.  ఈ జియో ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు లభిస్తోంది.

మరిన్ని వార్తలు