మానవత్వం చాటుకుంటున్న డాక్టర్‌ రూ. 50కే వైద్యం

2 Jul, 2020 16:36 IST|Sakshi

కోల్‌కతా: అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు లాక్‌డౌన్‌లో అతి తక్కువ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు కోల్‌కత్తాకు చెందిన డాక్టర్‌ ఫ్రౌద్‌ హలిమ్‌. అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ జమీర్‌ ఉద్దీన్‌ షా అల్లుడౌన హలీం కేవలం 50 రూపాయలకే కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చికిత్స అందిస్తున్నారు. దీంతో ఎంతో మంది ప్రముఖుల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ఉద్యోగులు, రోజువారి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న చిన్న వ్యాపారులు సైతం ఉపాధిని కోల్పోయారు. దీంతో వారంతా అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం చికిత్స కోసం ఆసుపత్రికి కూడా రాలేని స్థితిలో ఉన్నారు. వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని నిర్ణయించుకున్నా. దానిలో భాగంగానే రూ.50కి వైద్యం అందిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. (2 రోజులుగా ఇంట్లోనే క‌రోనా డెడ్‌బాడీ)


ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ క్లినిక్‌లో 50 రూపాయల టోకెన్‌ ఫీజు మాత్రమే తీసుకుని డయాలసిస్‌ అందిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేగాక దశాబ్ధంపైగా డా.హలీం ‘కోల్‌కత్తా స్వస్త్య సంకల్ప’ అనే అసోసియేషన్‌ను మరో 59 మంది డాక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఎలాంటి లాభార్జన లేకుండా అవసరమైన పేద రోగులకు 350 రూపాయలతో డయాలసిస్‌ చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు