భర్తకు ఫొటోలు పంపి.. అమెరికా మహిళకు బెదిరింపులు!

17 Feb, 2016 14:02 IST|Sakshi
భర్తకు ఫొటోలు పంపి.. అమెరికా మహిళకు బెదిరింపులు!

కోల్‌కతా: తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపి.. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగి అమెరికా మహిళను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ వ్యవహారంలో కోల్‌కతాకు చెందిన అవినాష్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. 30 ఏళ్లకుపైగా వయస్సున్న అవినాష్‌ గుప్తా ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత ఏడాది ఓ అమెరికా మహిళ కోల్‌కతాకు వచ్చింది. వీరిద్దరూ కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు.

ఆమె అమెరికాకు తిరిగి వెళ్లిన తర్వాత ఈ ప్రణయ సంబంధం దెబ్బతిన్నది. దీంతో తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలను తన భర్తకు పంపించడం ద్వారా అవినాష్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని అమెరికా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోల్‌కతా పోలీసులు ఆదివారం ముకుందనగర్‌లోని తన నివాసం నుంచి అవినాష్‌ను అరెస్టు చేశారు. అమెరికా మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ ఆమె భర్తకు పంపిస్తూ అవినాష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని, దీంతో ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్టుచేశామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు