రెండు నెలల్లో ఆ నగరమంతా వై ఫై

28 Jan, 2015 09:50 IST|Sakshi
రెండు నెలల్లో ఆ నగరమంతా వై ఫై

కోల్కతా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంటే.. ఉచిత వై ఫై సేవలు అందించడానికి మెట్రో నగరాలు సై అంటున్నాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా.. దేశంలో తొలి వై ఫై నగరంగా మారనుంది.

రెండు నెలల్లోపు కోల్కతాను పూర్తిగా వై ఫై నగరంగా మార్చనున్నారు. కోల్కతాలోని మొత్తం 144 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో వై ఫై సేవలు అందించనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 5 నుంచి కోల్కోతా పార్క్ స్ట్రీట్ నుంచి సర్వీసులను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ నాటికి ఈ సేవలు నగరమంతటా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ట్యాప్స్ యూజర్లు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని ప్రకటించారు. వై ఫై సేవలు అందించేందుకు ముంబై కార్పొరేషన్ నడుంబిగించగా.. బెంగళూరులో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వై ఫై సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు