114కు చేరిన కొల్లాం మృతుల సంఖ్య

14 Apr, 2016 17:15 IST|Sakshi
కొల్లాం (కేరళ) : పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదంలో మృతుల సంఖ్య 114కు చేరుకుంది. కాళికాదేవి ఆలయంలో వేడుకల్లో భాగంగా పేల్చిన బాణాసంచా వల్ల అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 106మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. దాదాపు 400ల మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా మారుతోంది. గురువారం మరో బాధితుడు మృతి చెందాడు. మరో ఆరుగురు క్షతగాత్రుల పరిస్థితి ప్రమాదం అంచున ఉందని వైద్యులు తెలిపారు.
 
ఇదిలా ఉంటే కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం ఏళ్లుగా వస్తోన్ ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు