ఏ మీట నొక్కినా బీజేపీకే..

23 Oct, 2019 04:01 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

పుణే: మహారాష్ట్రలోని కోరెగావ్‌ అసెంబ్లీ స్థానంలోని ఓ గ్రామంలో ఈవీఎం గురించి అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి పడుతోందంటూ కొందరు గ్రామస్తులు అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే వారి ఆరోపణలో నిజం లేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కీర్తి నలవాడె స్పష్టంచేశారు. గ్రామంలో ఎన్నికల సమయంలో ఈవీఎం మార్చిన మాట వాస్తవమని, అయితే అందులో ఓటు వేరే పార్టీకి పడుతోందన్నది అవాస్తవమన్నారు. ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ పాటిల్‌కు వేసే ఓటు బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజే భోసలేకి పడుతోందని గ్రామస్తులు అంటున్నారు.

ఈ విషయాన్ని గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్‌ సమర్దించడంతో రభస ప్రారంభమైంది. దీనికి తాను కూడా సాక్ష్యం అంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే శశికాంత్‌ షిండే అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్సీపీకి ఓటేయాలని వచి్చన దీపక్‌ రఘునాథ్‌ పవార్‌ తాను బటన్‌ నొక్కక ముందే బీజేపీకి చెందిన బటన్‌ పక్కనే ఉన్న రెడ్‌ లైట్‌ వెలిగిందని ఎన్నికల అధికారులతో అన్నారు. దీంతో అధికారి మాటపూర్వకంగా ఒప్పుకొని, బటన్‌ సరిగా పనిచేయకపోతుండటం కారణమని భావించి ఈవీఎం మారి్పంచాడు. కాగా, హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 68.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు