కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అంతంతే 

14 Feb, 2020 03:55 IST|Sakshi

కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన నిధులు పూర్తి నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల పట్ల కేంద్రం ఉదారపూర్వకంగా ఉండాలని, నిజమైన పని రాష్ట్రాల్లోనే జరగుతుందని, అందుకు రాష్ట్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక విడత బకాయి లు విడుదల చేశారని, త్వరలో మిగతా విడత బకాయిలు విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమకు హక్కుగా రావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ 2.7 లక్షల కోట్లు చెల్లిస్తే.. తెలంగాణకు కేంద్రం 1.15 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు.

మరిన్ని వార్తలు