టిప్పు సుల్తాన్‌ జయంతి : కుమారస్వామి వర్సెస్‌ బీజేపీ

6 Nov, 2018 20:41 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : టిప్పు సుల్తాన్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలా..లేదా అనేది బీజేపీయే తేల్చుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకల గురించి తాను ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని, దేశంలో భిన్న వర్గాలు వారికిష్టమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయని మాత్రమే వ్యాఖ్యానించానన్నారు.

కాగా టిప్పు సుల్తాన్‌ జయంతోత్సవాలను ఈనెల 10న నిర్వహించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే ఖండించారు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని (మాండ్య) కాపాడుకునే క్రమంలో మరణించారు.

కన్నడ భాషకు, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన టిప్పు సుల్తాన్‌ జయంతోత్సవాలను నిర్వహించడాన్ని పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నవంబర్‌ 10న టిప్పు సుల్తాన్‌ జయంతిని నిర్వహించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు