మోదీకి కుంబ్లే కృతజ్ఞతలు..

22 Jan, 2020 19:37 IST|Sakshi

న్యూఢిల్లీ: తనను ప్రేరణగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే కృతజ్ఞతలు తెలిపారు. పరిక్షా పే చర్చా కార్యక్రమంలో తన గురించి ప్రస్తావించిన మోదీకి కుంబ్లే ధ్యనవాదాలు తెలియజేశారు. అలాగే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..గత రెండు సంవత్సరాలుగా పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఒత్తిడికి గురికాకుండా మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని తాల్‌కోట్రా స్టేడియంలో నిర్వహించారు. 

దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని..టీమిండియా క్రికెటర్లు సాధించిన గొప్ప ప్రదర్శనలను తెలియజేసి విద్యార్థులకు మోదీ ప్రేరణ కలిగించారు. మెదీ మాట్లాడుతూ..2001 సంవత్సరంలో కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ను గుర్తు చేశారు. ఫాలో ఆన్‌ను ఎదుర్కొంటు, ఓటమి దాదాపు ఖాయమనుకున్న స్థితిని నుంచి టీమిండియా బ్యాట్స్‌మెన్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ అద్వితీయ ఆటతీరును కనబరిచి చరిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. తీవ్ర ఒత్తిడిలోను రాహుల్‌, లక్ష్మణ్‌ ప్రదర్శించిన తీరును విద్యార్థులు ప్రేరణగా తీసుకొని.. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను విజయవంతంగా రాయాలని మోదీ ఆకాంక్షించారు. పరీక్షలలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చచడానికి విద్యార్థలకు ఈ రెండు సంఘటనలు ప్రేరణ కలిగిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.
చదవండి: 'ధోని ఉంటాడో లేదో ఐపీఎల్‌తో తేలిపోనుంది'

మరిన్ని వార్తలు