మోడీ కోసం లడ్డూలు చేస్తున్న తల్లి

13 Sep, 2014 14:41 IST|Sakshi
మోడీ కోసం లడ్డూలు చేస్తున్న తల్లి

చుర్మా కే లడ్డూ, లప్సీ, కన్సర్.. ఇలాంటి రకరకాల స్వీట్లను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కోసం ఆయన తల్లి సిద్ధం చేయిస్తున్నారు. ఈనెల 17వ తేదీన ప్రధాని 64వ పుట్టినరోజు. ఆరోజు ఆయన తన తల్లి హీరాబా (95) ఆశీర్వాదాలు తీసుకోడానికి వస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు తన పుట్టినరోజున మోడీ స్వయంగా వచ్చి తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవారు. రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మరో కుమారుడు పంకజ్ మోడీ వద్ద హీరాబా ఉంటారు.

సెక్టార్ 22లో ఆయన ఉంటున్న ఇంటి వద్ద ఇప్పటికే శుభ్రం చేసి, స్వీట్లు తయారుచేయిస్తున్నారని, మోడీ రాక కోసం ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. హీరాబాకు మొత్తం నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారు సోమాభాయ్, నరేంద్ర, ప్రహ్లాద్, పంకజ్ మోడీ, వసంతిబెన్. వాళ్లలో చిన్న కొడుకు అయిన పంకజ్ వద్దే ఆ తల్లి ఉంటారు.

మరిన్ని వార్తలు