కోర్టు ముందు లొంగిపోయిన లాలూ

31 Aug, 2018 04:02 IST|Sakshi

రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్‌ మాజీ సీఎం అయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌. గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తాత్కాలిక బెయిల్‌ గడువు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సరెండర్‌ అయ్యారు. తర్వాత లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు.

సీబీఐ ప్రత్యేక కోర్టుల ముందు లొంగిపోవాలని జార్ఖండ్‌ హైకోర్టు ఇటీవల లాలూను ఆదేశించడం తెల్సిందే. చాయ్‌బసా ఖజానా నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించిన కేసుకు సంబంధించి తొలుత జడ్జి ఎదుట లాలూ హాజరయ్యారు. తర్వాత డియోఘర్, డమ్కా ట్రెజరీ కేసులకు సంబంధించి మరో జడ్జి ఎదుట లొంగిపోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలారు.

మరిన్ని వార్తలు