లాలు తనయులకు కేబినెట్ బెర్తులు

20 Nov, 2015 14:16 IST|Sakshi
లాలు తనయులకు కేబినెట్ బెర్తులు

పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లాలు తనయులు తేజస్వి , తేజ్ ప్రతాప్ ప్రమాణం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26)కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లాలు ప్రసాద్ దూరంగా ఉండగా, ఆయన తనయులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు