గ్లూకోజ్ స్థాయిలను గుర్తించేందుకు కొత్త ప్రొటీన్

13 Jun, 2014 00:42 IST|Sakshi

మధుమేహ బాధితులు ప్రతిసారీ వేలిపై సూదితో గుచ్చుకుని రక్తపు చుక్కతో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఇక తప్పనుంది. చిన్న ఇంప్లాంట్‌ను శరీరంలో అమర్చుకుంటే చాలు.. 24 గంటలూ ఆ పరికరమే గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ అణువులతో కలవగానే ఆకారం మారిపోయేలా శాస్త్రవేత్తలు సృష్టించిన ఓ కొత్త ప్రొటీన్‌తో ఇది సాధ్యం కానుంది. ఈ గ్లూకోజ్ బైండింగ్ ప్రొటీన్ (జీబీపీ) ఆధారంగా గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే సూక్ష్మ పరికరాలను రూపొం దించవచ్చని, దాని ద్వారా చాలా చౌకగా గ్లూకోజ్ పర్యవేక్షణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం నిమిషానికోసారి గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే పరికరాలు కూడా ఉన్నా.. అవి చాలా ఖరీదైనవని, పైగా ఎక్కువ కాలం పనిచేయవని అంటున్నారు. జీబీపీ సాయంతో రూపొందించే ఇంప్లాంట్లు మధుమేహ బాధితులకు బాగా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు