జమిలి ఎన్నికలపై పావులు కదుపుతున్న ఎన్డీఏ

7 Jul, 2018 09:32 IST|Sakshi

రాజకీయ పార్టీలతో లా కమీషన్‌ ముఖాముఖి

10 అభిప్రాయం చెప్పనున్న వైఎస్సార్‌సీపీ

సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం దేశంలోని 7 జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ, అనుమానాలు, సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకొనేందుకు లా కమీషన్‌ రాజకీయ పార్టీలతో చర్చించనుంది. 

అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఇతర ప్రధాన విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లా కమీషన్‌తో సమావేశానికి తాము హాజరు కాలేమంటూ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర పార్టీలు స్పష్టం చేశాయి. అయితే ప్రతికపక్షాలకు సర్ధిచెప్పి ఒప్పించేందుకు మోదీతో పాటు ఇతర ఎన్డీఏ నేతలు తీవ్ర కసరత్తలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలతో వనరులు, సమయం ఆదా అవుతాయని, అభివృద్ధి వేగ వంతం అవుతందని ప్రధాని సూచించినట్లు తెలిసింది.

10న అభిప్రాయం చెప్పనున్న వైఎస్సార్‌సీపీ : దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపడంపై తమ అభిప్రాయం చెప్ప వలసిందిగా లా కమీషన్‌ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న వైఎస్సార్‌సీపీ లా కమీషన్‌ ఎదట తన అభిప్రాయాన్ని చెప్పనుంది.

మరిన్ని వార్తలు