ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రానికి గ్రీన్‌ సిగ్నల్‌..!

28 Jun, 2018 21:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్రం ఏర్పాటుకు న్యాయశాఖ నుంచి పూర్తి అనుమతులు వచ్చినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి అనుమతులు రానున్నాయని వెల్లడించారు. మొత్తం 1600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మరో మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం శుంకుస్థాపన చేయనుంది. కాగా, క్షిపణి ప్రయోగాల్లో అగ్రదేశాలకు ధీటుగా దూసుకుపోతున్న భారత్‌లో ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లాలో అబ్దుల్‌ కలాం క్షిపణి ప్రయోగ కేంద్రం ఒక్కటే ఉండడం విశేషం.

మరిన్ని వార్తలు