విమర్శిస్తే దేశద్రోహం కాదు..

31 Aug, 2018 13:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని విమర్శించినంత మాత్రన దేశద్రోహంగా పరిగణించరాదని. హింస, చట్టవిరుద్ధ మార్గాల్లో ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం  ఉన్నట్టు వెల్లడైతేనే దేశద్రోహంగా పరిగణించాలని లా కమిషన్‌ స్పష్టం చేసింది. బ్రిటన్‌ నుంచి మనం ఐపీసీ సెక్షన్‌ 124ఏను సంగ్రహించగా ఆ దేశం పదేళ్ల కిందటే దేశద్రోహ చట్టాలను రద్దు చేసిందని పేర్కొంది. అలాంటి నియంతృత్వ చట్టాలను కొనసాగించేందుకు బ్రిటన్‌ సుముఖంగా లేదని తెలిపింది.

దేశద్రోహంపై సలహా పత్రంపై లా కమిషన్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ వంటి దేశాల్లో రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేలా దేశద్రోహ చట్టాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశాన్ని విమర్శించడం దేశద్రోహంగా పరిగణించరాదని, సానుకూల విమర్శలను దేశం స్వాగతించకుంటే స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులకు పెద్దతేడా ఉండదని వ్యాఖ్యానించింది. విమర్శించే హక్కు, సమర్ధించుకునే హక్కు భావప్రకటనా స్వేచ్ఛ కింద కాపాడాలని సలహా పత్రంలో లా కమిషన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు