మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు

2 Oct, 2018 17:58 IST|Sakshi
హిమాచల్‌ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై మహిళలు దాడి

హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో 5000 సార్లకు పైగా షేర్‌ కూడా అయింది. మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర శుక్లా ఈ వీడియోను షేర్‌ చేశారు. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్యే కాకుండా.. హిమాచల్‌ రహదారుల రవాణా సంఘ నాయకుడు ఈ చెప్పు దెబ్బలు తిన్నారు. వీడియోలో ఒక మహిళా.. సన్మాన కార్యక్రమంలో ఓ వ్యక్తికి దండ వేస్తూ ఉండగా... మరో మహిళ తన చెప్పు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటుంది. ఈ వీడియోలో వెనుక కనిపిస్తున్న పోస్టర్‌లో ‘హిమాచల్‌ పరివాహన్‌ మజ్దూర్‌ సంఘ్‌’ అని ఉంది. 

అయితే హమీర్ పూర్‌కు చెందిన సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే నరిందర్‌ థాకూర్‌ను సంప్రదించగా.. తనకు అలాంటి అవమానకర సంఘటన ఎదురు కాలేదని చెప్పారు. కానీ హమీర్‌ పూర్‌లో ఆ సంఘటన జరిగిందన్నారు. హిమాచల్‌ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై ఈ దాడి జరిగిందని, మహిళలు కొట్టింది తనని కాదని చెప్పేశారు. 2018 జూలై 22న ఇద్దరు ట్రైనీ మహిళా కండక్టర్లు అతనిపై ఈ దాడికి పాల్పడట్టు తెలిసింది. ఆ తర్వాత వారిద్దర్ని వారి వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కూడా రిపోర్టుల వచ్చాయి. ఇదే విషయాన్ని హిమాచల్‌ రహదారుల రవాణా సంఘ నాయకుడు శంకర్‌ సింగ్‌ కూడా ధృవీకరించారు. 2018 

జూన్‌ 22న కొంతమంది మహిళలు తనపై దాడి చేశారని, సన్మాన కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు మహిళా కండక్టర్లు తనను  ఈ విధంగా చెప్పుతో కొట్టారని చెప్పారు. వారికి కార్పొరేషన్‌లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అయితే మీకు బీజేపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, తాను ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్కర్‌ను అని, తనకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే ఫేస్‌బుక్‌లో షేర్‌ అవుతున్నట్టు బీజేపీ హమీర్‌పూర్‌ ఎమ్మెల్యేపై ఆ ఈవెంట్‌లో ఎలాంటి దాడి జరగలేదని, ఈ అవమానకర సంఘటనను హిమాచల్‌ రోడ్డు రహదారుల కార్పొరేషన్‌ లేబర్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ సింగ్‌ ఈ దాడికి గురయ్యారని చెప్పారు.   

మరిన్ని వార్తలు