ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఎల్‌ఈడీ టీవీలు

25 Dec, 2016 02:23 IST|Sakshi
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఎల్‌ఈడీ టీవీలు

వాటి ద్వారా ఆరోగ్య సూత్రాలు, సలహాలు ప్రసారం
ఈఎస్‌ఐసీ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం

సాక్షి, అమరావతి:
దేశవ్యాప్తంగా కార్మిక రాజ్య బీమా ఆస్పత్రుల్లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయను న్నారు. ఈ మేరకు ఈఎస్‌ఐ కార్పొ రేషన్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈఎస్‌ఐ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న డిస్పెన్సరీల్లోనూ  ఎల్‌ఈడీ తెరలు ఏర్పా టు చేయనున్నారు. తెలంగాణ, ఏపీల్లోనే 170కి పైగా డిస్పెన్సరీలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా డిస్పెన్సరీలున్నట్టు అంచనా. ప్రతి డిస్పెన్సరీలోనూ స్థాయిని బట్టి ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య సలహాలు, సూచ నలు, తీసుకోవాల్సిన జాగ్ర త్తలు గంటకు రెండుసార్లు ఆరోగ్యానికి సంబంధించిన  వాణిజ్య ప్రకటన లు  ప్రసారమవుతాయి. టీవీలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు పూజారి సర్వీసెస్‌ అనే సంస్థ కేంద్రంతో ఒప్పందం కుదు ర్చుకుంది. మరోనెల రోజుల్లో ఈఎస్‌ఐ ఆస్ప త్రుల్లో టీవీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తవుతుందని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు