అధికారులకు చుక్కలు చూపించిన చిరుత

24 May, 2020 13:00 IST|Sakshi

సూరత్‌ : లాక్‌డౌన్‌  నేపథ్యంలో అడవిలో ఉండాల్సిన జంతువులు ఆహార అన్వేషణలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ ప్రాంతంలో శనివారం ఒక చిరుతపులి హల్‌చల్‌ చేసింది. మొదట ఒక ఇంట్లోకి దూరిన చిరుత కారు పక్కన నక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటి యజమాని కారును తీద్దామని దగ్గరకు వచ్చి చూస్తే చిరుతపులి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే యానిమల్‌ రెస్య్కూ ఆపరేషన్‌ టీమ్‌కు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న ఆపరేషన్‌ రెస్క్యూ టీమ్‌ అక్కడిని చేరుకొని చిరుతను బంధించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారులకు చిక్కకుండా ఇళ్లలోని గోడలు దూకుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే పులిని పట్టుకునేందుకు పన్నిన వలను కూడా చేధించి అక్కడి నుంచి పరుగులు తీసింది. చివరకు ఎలాగోలా పోలీసుల సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చిన అధికారులు దానిని బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అధికారులకు తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆవు చ‌నిపోయింద‌ని రోడ్ల‌ పైకి జ‌నం
క్వారంటైన్‌లో కోడికూర ఇవ్వలేదని..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు