ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం

20 Dec, 2017 11:38 IST|Sakshi

సాక్షి, డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతా జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు ఎవరి చేతికి చిక్కకుండా పరారైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లోని కేవల్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని ఓ నివాసంలో గార్డెన్‌లోకి వెళ్లింది.

అక్కడే కొద్ది సేపు కూర్చున్న చిరుత ఆ వెంటనే సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం తమ శక్తిమేరకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్నవారిపైకి దూసుకెళ్లిన చిరుత నలుగురైదుగురిని చూసి మాత్రం భయపడింది. దీంతో జనాలంతా కూడా ఒకే చోట పోగయ్యారు. ఈ తంతు దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. అయితే, కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అక్కడికి వచ్చి గన్‌ సిద్ధం చేస్తుండగానే చిరుత కనిపించకుండా మాయమైంది.

ఇళ్లల్లోకి చిరుత.. జనాలు అతలాకుతలం

మరిన్ని వార్తలు