వైరల్‌: ఆ కోటలో చిరుత కుటుంబం

17 Apr, 2020 13:07 IST|Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమ్యారు. దీంతో అడవి తీరంలోని గ్రామాల్లో సింహాలు, పులులు సంచరిస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చిరుత పులి రాజస్థాన్‌లోని ఓ ఇంటిలో ఏకంగా తన మూడు  పిల్లలతో కలిసి నివాసం ఏర్పరుచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీసీ ఫుటేజ్‌లో రికార్డైనా ఈ వీడియోను ఆటవీ అధికారి పర్వీన్ కశ్వన్ గురువారం ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన చిరుత.. తన పిల్లలను నోటితో కరుచుకుని తీసుకువెళ్తు కనిపించింది. ఇక ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఈ వీడియో పంచుకున్నందుకు ధన్యవాదాలు’, ‘ఇది అద్బుతం’  ‘ఎంత ముద్దుగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చండీగఢ్‌లో అడవి జంతువు కలకలం!)


అయితే ఆ ఇంటి ముందు సీసీ కెమారాలను ఏర్పాటు చేసి నిరంతరం చిరుత కదలికలను  అధికారులు గమనిస్తున్నట్లు పర్విన్‌ తెలిపాడు. 21 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటికే పరిమితయ్యారు. ఈ క్రమంలో ఈ తల్లి చిరుత కూడా నివాసం కోసం తంటోల్‌ గ్రామంలోని పాతబడిన కోటను తన పిల్లల కోసం నివాసం చేసుకుంది. ఇక ఈ చిరుత రోజంతా ఆహార వేటకు వెళ్లి తిరిగి రాత్రిపూట తన పిల్లల దగ్గరికి వస్తుంది. ప్రసుతం చిరుత పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు