బహదుర్తోనే పాక్ భారీ స్కెచ్

10 Aug, 2016 16:19 IST|Sakshi
బహదుర్తోనే పాక్ భారీ స్కెచ్

ఢిల్లీ : పాకిస్థానీ ఉగ్ర‌వాది బ‌హ‌దూర్ అలీ (అలియాస్ సైఫుల్లా)ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టింది. గత నెల 25న జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దులు దాటి భారత్‌లోకి ఆయుధాలతో చొరబడిన బహదూర్ అలీ భద్రతా దళాలకు చిక్కిన విషయం తెలిసిందే.

పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కరే తొయిబా క్యాంపులు నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు హెచ్చరించారు. పాక్ అతడిని చొరబాటు ద్వారా కశ్మీర్కు పంపిందని ఎన్ఐఏ పేర్కొంది. కశ్మీర్ పరిస్థితిని అవకాశంగా మలుచుకునేందుకు ఎల్ఈటీ యత్నిస్తుందని ఎన్ఐఏ వెల్లడించింది.

పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తాయిబాకు చెందిన బహదూర్ అలీ గత నెలలో భారత్‌లోకి భారీగా ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలతో చొరబడ్డాడు. భద్రతాదళాలకు చిక్కడంతో తాను పాక్ జాతీయుడినని అంగీకరించాడు. పైగా సాధ్యమైనంత ఎక్కువమందిని కాల్చిచంపేందుకే లష్కరే ఆదేశాల మేరకు భారత్‌లోకి వచ్చినట్లు స్పష్టం చేశాడు. అదుపులోకి తీసుకున్న బహదుర్ అలీ నుంచి మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులతో పాటు 23వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు