‘ఎల్‌జీ’ ట్వీట్‌పై పేలుతున్న జోకులు

16 Jun, 2018 19:56 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌, మంత్రులు ఈ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వీరు తన కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తుండటంతో, గవర్నర్‌ తన ఉద్యోగాన్ని ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన ఫైల్స్‌ను మాత్రమే చూసుకుంటున్న గవర్నర్‌, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక్క ఫైల్‌ను ముట్టడం లేదు. అంతేకాక ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రుల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని అసలు పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో జరుగుతున్న ఈ హైడ్రామాపై డైరెక్టర్‌ శిరిష్‌ కుందర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌గా వైరల్‌ అవుతోంది. 

సీరియస్‌ సమస్యలపై కూడా హాస్యాభరితమైన ట్వీట్‌ చేసే శిరిష్‌ కుందర్‌, నేడు కూడా ఇదే విధంగా హాస్యం పండించారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ను అడగండి.. ఢిల్లీలో సర్వీసు సెంటర్‌ ఉందా? అని.. అక్కడ ఎల్‌జీ పనిచేయడం లేదు... అని హాస్యాస్పదంగా కామెంట్‌ చేశారు. అయితే శిరిష్‌ కుందర్‌ చేసిన ఈ ట్వీట్‌ నిజంగా ఎల్‌జీ కంపెనీ గురించి అనుకున్నారామో? కాదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గురించి. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌... నిజంగా తమ వస్తువులపై ఫిర్యాదు చేశారేమోనని భావించి.. వెంటనే జవాబిచ్చింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ కాంటాక్ట్‌ వివరాలు మాకు అందించండి. దీంతో వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం ’ అని ట్వీట్‌ చేసింది. శిరిష్‌ కుందర్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన ట్వీట్లు కొన్ని గంటల్లోనే తొలగించారు. శిరిష్‌ కుందర్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ మధ్య జరిగిన సంభాషణపై ట్విటర్‌లో జోకులు పేలుతున్నాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..

తెగిన వేలే పట్టించింది

3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్‌

బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు