పాలసీదారులకు ఎల్‌ఐసీ ఆఫర్‌

5 Nov, 2019 05:11 IST|Sakshi

రెండేళ్ల పైబడి ల్యాప్స్‌ అయిన పాలసీలకూ పునరుద్ధరణ అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్‌ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్‌ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్‌ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్‌డీఏఐని ఎల్‌ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్‌–లింక్డ్‌ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్‌ లింక్డ్‌ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు.

మరిన్ని వార్తలు