ఈ లిప్‌స్టిక్‌ మిమ్మల్ని కాపాడుతుంది

9 Jan, 2020 13:33 IST|Sakshi

ఫొటోలో కనిపిస్తున్న లిప్‌స్టిక్‌ సాధారణమైనది కాదు. మహిళల అందానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్‌ చౌరేసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త మహిళల స్వీయ రక్షణ కోసం ఓ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది అచ్చంగా లిప్‌స్టిక్‌ను పోలి ఉండే లిప్‌స్టిక్‌ గన్‌. దీన్ని నొక్కితే పేలుడు శబ్ధం వినిపిస్తుంది. అంతేకాక నేరుగా ఎమర్జెన్సీ నంబర్‌ 112కు కనెక్ట్‌ అవుతుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రమాదంలో ఉన్న మహిళకు సాయపడతారు.

ఈ లిప్‌స్టిక్‌ గన్‌ ఆవిష్కర్త శ్యామ్‌ మాట్లాడుతూ.. ‘ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనపుడు మహిళలు ఈ లిప్‌స్టిక్‌పై ఉన్న బటన్‌ నొక్కితే సరిపోతుంది. వెంటనే పోలీసులకు ఫోన్‌ వెళుతుంది. దీనికి చార్జింగ్‌ సదుపాయంతో పాటు బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. నిస్సందేహంగా అందరూ తమ వెంట దీన్ని తీసుకెళ్లవచ్చు’ అని పేర్కొన్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి అతనికి సుమారు ఒక నెల సమయం పట్టగా కేవలం రూ.600 మాత్రమే ఖర్చయ్యాయని తెలిపాడు.

త్వరలోనే అతను ఈ లిప్‌స్టిక్‌ గన్‌పై పేటెంట్‌ హక్కులు తీసుకోనున్నాడు. కాగా ఈ పరికరాన్ని ముందుగా బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన షెఫాలి రాయ్‌ ప్రయోగించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది వెంట తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ గన్‌ చేసే శబ్ధం ఎంతో భయాన్ని కల్పించేదిగా ఉంది. ఇది మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఎందుకంటే అందరూ దీన్ని మామూలు లిప్‌స్టిక్‌గా భ్రమపడతారు’ అని చెప్పుకొచ్చింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్రి పేరుతో గోవాలో జల్సా..

సుప్రీంలో నిర్భయ దోషి క్యూరేటివ్‌ పిటిషన్‌..

ముఖం, శరీరంపై 101 కత్తి గాట్లు.. ఆపై..

కారుకు రూ. 27.68 లక్షల జరిమానా

తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని

సినిమా

దీపిక నిర్మాత.. పబ్లిసిటీ స్టంట్‌ అయితే ఏంటి?

చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌

తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి

ఈ బంధంలో.. ఆ రెండు మాత్రమే...!

నటి ప్రేమాయణం.. విషం తాగిన తల్లి

దర్బార్‌: ట్విటర్‌లో ఏమంటున్నారంటే?