మహారాష్ట్రలో తెరుచుకోనున్న మ‌ద్యం దుకాణాలు..

21 Apr, 2020 09:56 IST|Sakshi

ముంబై :  లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం దొర్క‌క మందుబాబులు అల్లాడుతున్న వేళ మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లోనే అక్క‌డ మ‌ద్యంషాపులు తెరచుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. రెడ్‌జోన్లు లేని ప్రాంతాల్లో ద‌శ‌ల‌వారీగా మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తినిస్తూ నోటిఫికేష‌న్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నుంది ప్ర‌భుత్వం. కాక‌పోతే కొన్ని ప్రత్యేకమైన గైడ్‌ లైన్స్‌ ఆధారంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వనుంది.

ఇందులో సోష‌ల్ డిస్టెన్సింగ్ క‌శ్చితంగా పాటిస్తూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని రాష్ర్ట ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఈ రూల్స్ అన్ని పాటిస్తేనే ప‌ర్మిష‌న్ ఇస్తామ‌ని అన్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న  ఒక‌ట్రొండు రోజుల్లో వెలువ‌డ‌నుంది. మేఘాలయ, అసోం , ప‌శ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా దీనిపై సానుకూలంగానే ఉంది. మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వ తాజా ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డ మందుబాబులు తెగ సంతోష‌ప‌డుతున్నార‌ట‌.  

మరిన్ని వార్తలు