ఆరో దశలో 57% పోలింగ్‌

5 Mar, 2017 01:28 IST|Sakshi
ఆరో దశలో 57% పోలింగ్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్‌లో 57.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1.72 కోట్ల ఓటర్లున్న 49 స్థానాలకు 635 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని యూపీ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అజాంగఢ్‌తో పాటు, బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్, కేంద్ర మంత్రి కల్రాజ్‌ మిశ్రా డియోరియా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశ పోలింగ్‌లో ఉన్నాయి. బీఎస్పీ ముఖ్యనేత స్వామి ప్రసాద్‌ మౌర్య (పద్రౌనా),  ఎస్పీ తరఫున మాజీ గవర్నర్‌ రాంనరేశ్‌యాదవ్‌ తనయుడు శ్యాంబహదూర్‌ యాదవ్‌ (ఫుల్పూర్‌ పవాయ్‌) ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖలు.

మణిపూర్‌లో 84 శాతం పోలింగ్‌
ఇంఫాల్‌: మణిపుర్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో గురువారం రికార్డు స్థాయిలో 84 శాతం పోలింగ్‌ నమోదైంది. 38 స్థానాల్లో 168 మంది పోటీపడ్డారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు