భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..ఇక‌పై ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం

23 May, 2020 09:01 IST|Sakshi

బెంగుళూరు : క‌రోనా కార‌ణంగా మూత‌బ‌డ్డ ఆల‌యాలు తిరిగి తెరుచుకునే ప‌రిస్థితి ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. అయితే ఆల‌యాలు తెర‌వాల‌ని కోరుతున్న భక్తుల కోరిక మేర‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వారికి కొంత ఉప‌శ‌మ‌నం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంది. రాష్ట్రంలోని ప‌లు ఆల‌యాల్లో ఇక‌పై పూజ‌లు, కైంక‌ర్యాలు ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యాల్లో భ‌క్త‌లను అనుమ‌తించాల‌ని కోరుతున్నార‌ని, అయితే ఆన్‌లైన్‌లో సేవ‌లు అన్ని ఆల‌య వెబ్ పోర్ట‌ర్‌లో అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ప్ర‌సాదాలు కూడా ఆన్‌లైన్ ఆర్డ‌ర్ ద్వారా భ‌క్తుల‌కు పంపిణీ చేస్తామ‌ని తెలిపింది.  (నెల ముందు నుంచే ‘రాజధాని’ బుకింగ్‌ )

ఈ నెలాఖ‌రులోగా ఈ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు ఇదే ప‌ద్ద‌తి అనుస‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది. దీంతో ఆల‌యాల్లో దేవుడ్ని ద‌ర్శించుకోలేక‌పోతున్నాం అని బాధ‌ప‌డే భ‌క్తుల‌కు కాస్త ఊర‌ట క‌లిగించే అంశ‌మే అయిన‌ప్ప‌టికీ ఆన్‌లైన్ సేవ‌ల‌కు నిర్ణీత డ‌బ్బు క‌ట్టాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే భ‌క్తుల నీరాజ‌నాలు లేక ఆల‌యాలు వెల‌వెలబోతున్నాయి. అంతేకాకుండా  క‌రోనా కార‌ణంగా భ‌క్తులు లేక ప్ర‌ముఖ ఆల‌యాల్లోనూ ఆదాయానికి గండి ప‌డిన‌ట్ల‌య్యింది. అధికారిక స‌మాచారం ప్ర‌కారం..లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ర్టంలోని కుక్కే సుబ్రమణ్య ఆలయం, కొల్లూరు మూకాంబికా ఆలయం, మైసూరులోని చాముండేశ్వరి ఆలయం, కటేలు దుర్గాపరమేశ్వరి లాంటి ప్ర‌ముఖ ఆల‌యాలు 100 కోట్ల‌కు పైగానే ఆదాయాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం తీసుకుచ్చిన ఆన్‌లైన్ సేవ‌ల ద్వారా కొంత‌మేర దిద్దుబాటు చ‌ర్య‌లు ఉండొచ్చ‌ని భావిస్తున్న‌ట్లు ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు. (మాస్కులు ధరించని వారి నుంచి 3 లక్షల 43 వేలు వసూలు )


 

మరిన్ని వార్తలు