పోలీసుల దాష్టీకం.. గర్భిణి మృతి..!

8 Mar, 2018 08:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవేపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. హెల్మెట్‌ ధరించలేదని బైక్‌పై వెళ్తున్న దంపతులను పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి గర్భిణి జారిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి.

వివరాలివి.. గణేష్‌ సర్కిల్‌ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.  బైక్‌ వెనుక కూర్చున్న ఇన్స్‌పెక్టర్‌ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్‌పెక్టర్‌ కాలు గర్భిణీ పొట్టపై బలంగా దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి.

దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు  తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.  ఈ ఘటన పలువురు పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి మితిమిరడంతో డీఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. చర్చలకు వచ్చిన డీఎస్పీపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. రోడ్డుపై బైఠాయించడంతో బారీ స్థాయిలో పోలీస్‌ బలగాలు మోహరించాయి. పోలీసుల చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. రోజు మాదిరే పోలీసులు హైవేపై చేకింగ్‌ చేస్తున్నారు. ఆ  సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తిరుచ్చి రేంజ్‌ డీఐజీ నేతృత్వంలో విచారణ మొదలెట్టామన్నారు. దీనికి కారణమైన ఇన్స్‌పెక్టర్‌ను అరెస్టు చేసినట్లు పోలీస్‌ అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు