ఓ గాడ్‌! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?

7 Apr, 2020 09:04 IST|Sakshi

కార్పొరేట్‌ దిగ్గజం ఎం అండ్‌ ఎం ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా​కు ఏదైనా వినూత్న విషయం కంట పడితే చాలు.. వెంటనే దాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. ఈయన పెట్టే ప్రతి పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. కరోనాను అధిగమించేందుకు ఇటీవల పలు సూచనలు చేసిన ఆయన తాజాగా వాట్సాప్‌ వండర్‌ బాక్స్‌ పేరుతో మరో పోస్ట్‌ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్‌డౌన్‌ అవులవుతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఇంటి నుంచి వర్క్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారి వేషాధారణకు సంబంధించిన ఓ ఫన్నీ మీమ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్)

‘ఇది నా వాట్సాప్‌ వండర్‌ బాక్స్‌ నుంచి వచ్చింది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో ఇంటి నుంచి ఆఫీస్‌ పనులు చేసేపటప్పుడు వీడియో కాల్‌లో నేను చొక్కా, లుంగీని ధరించేవాడిని. ఎందుకంటే ఆ సమయంలో నిలబడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక ఇప్పుడు ఈ ట్వీట్‌ తర్వాత కూడా లుంగీ కట్టుకోవాలని నా సహచరులు నాకు సూచిస్తారేమో..’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేసిన ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. అంతపెద్ద కార్పొరేట్‌ దిగ్గజం లుంగీ ధరించడంపై షాక్‌కు గురవుతున్నారు. ‘ఓ మై గాడ్‌.. మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా’ అంటూ ఓ నెటిజన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ('శ్రీనివాస గౌడకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వండి')

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా