లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. వీడియో కాల్‌లో పెళ్లి

4 Apr, 2020 11:26 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇల్లు దాటడానికి కూడా పరిమితులు ఉండటంతో ప్రజలంతా ఇళ్ల​కే పరిమితమయ్యారు. దీనికితోడు నిత్యావసరాల సేవలు తప్ప మిగతా అన్ని సేవలను నిలిపివేశారు. దీంతో పెళ్లి వేడుకలు, ఫంక్షన్‌ హాల్‌లు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఓ ముస్లిం కుటుంబం వీడియో కాల్‌లో పెళ్లి జరిపించిన అరుదైన సంఘటన శుక్రవారం మహరాష్ట్రలో జరిగింది. మహరాష్ట్రలో ఉన్న వరుడు మహమ్మద్‌కు జౌరంగబాద్‌కు చెందిన వధువుతో కుటుంబం సభ్యులు వినూత్నంగా వీడియో కాల్‌ ద్వారా పెళ్లి తంతును కానిచ్చేశారు. (ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు)

దీనిపై వరుడి తండ్రి మొహమ్మద్‌ గయాజ్‌ మాట్లాడుతూ.. ‘6 నెలల ముందే వీరి వివాహ తేదీ నిశ్చయమైంది. లాక్‌డౌన్‌ కారణంగా మా కుటుంబ పెద్దలతో కలిసి ఇలా వీడియో కాల్‌ ద్వారా పెళ్లి జరిపించాం’ అని చెప్పాడు. ఇక వివాహం జరిపించిన ముస్లిం మత బోధకుడు స్పందిస్తూ.. కేవలం కుటుంబం సభ్యుల మధ్య మాత్రమే ఈ వివాహా వేడుకను నిర్వహించారు. ఎలాంటి అర్భాటం లేకుండా జరిగినప్పటికీ ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అన్నాడు. (తమిళనాడును కబళిస్తున్న కరోనా..)

మరిన్ని వార్తలు