క‌రోనా: యూపీ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం

10 Jul, 2020 10:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ల‌క్నో :  క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈరోజు రాత్రి 10 గంట‌ల నుంచి 13వ తేదీ ఉద‌యం ఐదు గంట‌ల వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటుంద‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలన్నింటినీ మూసివేయాల‌ని ఆదేశించారు. అయితే రైళ్లు, విమాన‌యాన స‌ర్వీసులు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా ర‌హ‌దారి నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని క‌ర్మాగారాల‌కు కూడా అనుమ‌తినిస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ  చేసింది. (మహారాష్ట్ర వైఖరిని తప్పుబట్టిన సుప్రీంకోర్టు)

ఉత్తరప్రదేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30,000కి పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వీరిలో 20వేల‌ మంది పైగా కోలుకొని డిశ్చార్జి అయిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు న‌మోద‌వుతున్న  రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కూడా ఒక‌టి. ఈ నేప‌థ్యంలో టెస్టుల సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచాల‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరిన‌ట్లు స‌మాచారం. యూపీలో క‌రోనా టెస్టులు త‌క్కువ‌గా జరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌త‌వారం క‌రోనా ప‌రిస్థితిపై  హ‌రియాణా, ఢిల్లీ, యూపీ ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. 
(అజ్ఞానంతోనే ప్రతిపక్షాల విమర్శలు)

 
 

>
మరిన్ని వార్తలు