రైల్వే ఉద్యోగులకు ‘సీజీహెచ్‌ఎస్‌’ చికిత్స

4 Nov, 2018 05:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా రైల్వే ఉద్యోగులకు పలు చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లోకో పైలట్లు, ట్రాక్‌మెన్‌లు, గ్యాంగ్‌మెన్‌లకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కింద ఫిజియో థెరపీ, వృత్తి సంబంధ థెరపీ, స్పీచ్‌ థెరపీ వంటి చికిత్సలను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చికిత్సలు రైల్వే ఉద్యోగులకు అందుబాటులో లేవు. ఒక వేళ బయట వేరే చోట చికిత్స చేయించుకున్నా వారికి రీయింబర్స్‌మెంట్‌ ఉండేది కాదు. ‘రైల్వేలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్రాక్‌మెన్‌లు, గ్యాంగ్‌మెన్‌లు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రయాణికుల భద్రత వీరిపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించాం’ అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు