ఆందోళనల మధ్య బడ్జెట్‌ ఆమోదం

15 Mar, 2018 02:21 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆందోళనలు 8వ రోజు కూడా కొనసాగాయి. సభ్యుల నిరసన మధ్యే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్‌ బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ఎటువంటి చర్చా లేకుండానే లోక్‌సభ ఆమోదించింది.  బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ప్రారంభించారు.

ఈ గొడవ మధ్యనే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  ఆర్థిక బిల్లును, రూ.89.25 లక్షల కోట్ల ద్రవ్యవినియోగ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేవలం 25 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ వెంటనే సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. దీంతో మోదీ ప్రభుత్వం ఐదోది, ఆఖరు బడ్జెట్‌ ఆమోదం పొందినట్లయింది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించకున్నా ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు. రాజ్యసభలో ఉదయం నుంచి విపక్షాలు ఆందోళన చేయటంతో గురువారానికి వాయిదావేశారు. 

మరిన్ని వార్తలు