వారి కోసం లాంగ్‌రేంజ్‌ విమానం

27 Jan, 2019 04:00 IST|Sakshi
మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీ

పరారైన ఆర్థికనేరగాళ్లను తెచ్చేందుకు..

న్యూఢిల్లీ: దేశంలో వేల కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడి వెస్టిండీస్‌ దీవుల్లో ఆశ్రయం పొందుతున్న మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీయే లక్ష్యంగా ఈడీ/ సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. వేల కోట్లు మోసాలకు పాల్పడిన ఆ ఘరానా నేరగాళ్లను పట్టుకు వచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన ఎక్కడా ఆగకుండా ప్రయాణించే లాంగ్‌రేంజ్‌ బోయింగ్‌ విమానంలో తమ అధికారులను అక్కడికి పంపించనున్నారు.

వజ్రాల వ్యాపారులు మెహుల్‌ చోక్సీ, జతిన్‌ మెహతా తదితరులు.. డబ్బులిస్తే చాలు పౌరసత్వం చౌకగా దొరికే కరీబియన్‌ దీవుల్లోనే ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. జతిన్‌ మెహతా సెయింట్‌ కిట్స్, నెవిస్‌ దీవుల పౌరసత్వం, మెహుల్‌ చోక్సీ అంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, నీరవ్‌ మోదీ యూరప్‌లో రహస్య ప్రాంతంలో ఉండి ఉంటాడని ఈడీ వర్గాలంటున్నాయి. చోక్సీతోపాటు యూరప్‌లో ఉన్న మోదీని తీసుకువస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.   

గౌతమ్‌ ఖేతాన్‌ అరెస్ట్‌
నల్లధనం కలిగి ఉండటం, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసు’ నిందితుడు, న్యాయవాది గౌతమ్‌ ఖేతాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం∙కేసులో అరెస్టయిన మరో దళారీ క్రిష్టియన్‌ మిషెల్‌ను విచారించగా, అతను వెల్లడించిన వివరాల మేరకే ఖేతాన్‌ను ఎన్‌ఫోన్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు