ప్రియురాలికి ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టి...

16 Mar, 2016 14:55 IST|Sakshi
ప్రియురాలికి ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టి...

ఫరిదాబాద్: ప్రియురాలికి ఫేస్ బుక్ లో ఆడియో మెసేస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. 16వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు హర్యానాలోని గుర్గావ్ లో కాల్ సెంటర్ లో టీమ్ మేనేజర్ గా పనిచేస్తున్న అమన్ నాగపాల్ గా గుర్తించారు.

తనతో కలిసి పనిచేస్తున్న యువతితో అతడు సహజీవనం చేస్తున్నాడని, ఆమెతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఎస్ఆర్ఎస్ హిల్ వ్యూలో నివసిస్తున్నారని, కొద్దిరోజుల క్రితం ఘర్షణ పడ్డారని చెప్పారు. అమన్ ప్రియురాలు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడంతో, మానసికంగా అతడు కుంగిపోయాడని వెల్లడించారు.

ఆత్మహత్యకు ముందు అమన్ తన ఆవేదనను రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడని చెప్పారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని పోలీసు అధికారి కిమ్తీ లాల్ తెలిపారు. యువతి తండ్రి, పిన్ని, మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు