బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

15 Jul, 2018 16:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం‌: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకొని బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం క్రమేనా బలహీన పడే అవకాశం ఉందని వాతావరణశాఖా అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు