తివారి హత్య : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

2 Oct, 2018 08:44 IST|Sakshi
పోలీస్‌ కాల్పుల్లో మృతి చెందిన టెకీ వివేక్‌ తివారి(ఫైల్‌ ఫోటో)

లక్నో : పోలీస్‌ కాల్పుల్లో మరణించిన ఆపిల్‌ సంస్థ ఉద్యోగి వివేక్‌ తివారి కుటుంబాన్ని ఆదుకోవడానికి యూపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వివేక్‌ భార్య కల్పన తివారికి మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం గురించి మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రమణి త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకే మేం వికేక్‌ తివారి భార్యకు ఉద్యోగం కల్పిస్తున్నాం. ఆమె పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ చదివింది. ఆమె అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇస్తాము. ఇందుకోసం అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు, డాక్యుమెంట్స్‌ తీసుకున్నాం. అన్ని ఫార్మలిటీస్‌ పూర్తయ్యాయి. త్వరలోనే ఆమెను మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌కి కేటాయిస్తాం’ అని తెలిపారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వివేక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వివేక్‌ కుటుంబాన్ని అదుకుంటుందని తెలిపారు. అంతేకకా వివేక్‌ మృతికి నష్ట పరిహారంగా ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సొమ్మును వివేక్‌ కూతుర్ల పేరున ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు