6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్‌ఐవీ పేషెంట్‌

27 May, 2020 09:57 IST|Sakshi

లక్నో: హెచ్‌ఐవీ పేషెంట్‌ ఒకరు కేవలం ఆరు రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గొండాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడటంతో కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చేర్చారు. పరీక్షల అనంతరం అతడికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. అంతేకాక బాధితుడు తనకు హెచ్‌ఐవీ ఉందని... ప్రస్తుతం అందుకు సంబంధించిన మందులు వాడుతున్నాని వైద్యులతో చెప్పాడు. ఈ మేరకు చికిత్స అందించడంతో  కేవలం 6 రోజుల్లోనే సదరు వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.(కరోనా పాజిటీవ్.. బిడ్డకు జన్మనిచ్చిన ‌మహిళ

ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... ‘ఇలాంటి కేసు రావడం ఇదే ప్రథమం. ప్రొటోకాల్‌ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లో అతడికి కరోనా నయమైంది. చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నెగిటీవ్‌గా రావడంతో అతడిని డిశ్చార్జ్‌ చేశాం. ప్రస్తుతం రెండు వారాల పాటు అతడిని హోం క్వారంటైన్‌లో ఉండమని చెప్పాం. గతంలో ఓ క్యాన్సర్‌ పేషెంట్‌కు కూడా కరోనా పూర్తిగా నయమయ్యింది. డయబెటీస్‌ ఉన్న వారు కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు’ అని వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు