‘తొలి’ చంద్రగ్రహణం నేడే

10 Jan, 2020 09:24 IST|Sakshi
చంద్రగ్రహణం (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా: ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు కాగా.. మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం కానుంది. జనవరి 10వ తేదీ రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనున్నట్లు ఎంపీ బిర్లా ప్లానెటోరియమ్‌ బుధవారం తెలిపింది. జూన్‌ 5, జూలై 5, నవంబర్‌ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి.

మరిన్ని వార్తలు