క్షమించండి.. తప్పుచేశా!

12 Feb, 2019 01:30 IST|Sakshi

సుప్రీంకు సీబీఐ నాగేశ్వరరావు క్షమాపణలు

న్యూఢిల్లీ: సీబీఐ అదనపు డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పా రు. బిహార్‌ ఆశ్ర మ పాఠశాలల్లో బాలికల వేధింపులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేయడంపై గురువారం సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో సోమవారం ఆయన కోర్టుకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు అనుమతి తీసుకోకుండానే బదిలీ చేయడం పొరపాటని అందులో అంగీకరించారు. ‘నా తప్పును అంగీకరిస్తున్నాను.  క్షమాపణలు కోరుతున్నా.  ఏకేశర్మ బదిలీ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం, ఉల్లంఘన అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆ బదిలీ చేసి ఉండాల్సింది కాదు’అని అందులో తెలిపారు.

>
మరిన్ని వార్తలు