జనతా కర్ఫ్యూని పాటించండి

21 Mar, 2020 01:48 IST|Sakshi

శివరాజ్‌ సింగ్‌ ప్రకటన

తానే సీఎం అన్న సూచనా?  

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహానే అని సూచన ప్రాయంగా తెలుస్తోంది. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూని పాటించండంటూ చౌహాన్‌ ప్రజలను కోరడం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించిన అనంతరం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాలనీ, ఎవ్వరూ బయటకు రాకూడదనీ, జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుని ప్రజలంతా పాటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రజలను కోరారు. అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కుప్పకూలిందనీ, అందులో బీజేపీ పాత్ర లేదన్నారు. అయితే తమ పార్టీ శాసనసభ్యులకు బీజేపీ డబ్బులు ఎరగా వేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌కి ఎవరు సీఎం కావాలనే విషయంలోనూ చౌహాన్‌కీ, మిశ్రాకీ విభేదాలున్నాయని దిగ్విజయ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు