రాహుల్ గాంధీని తప్పించండి: కాంగ్రెస్ నేత

12 Oct, 2016 12:30 IST|Sakshi
రాహుల్ గాంధీని తప్పించండి: కాంగ్రెస్ నేత

రాహుల్ గాంధీని వెంటనే పార్టీ నుంచి తప్పించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు శైలేష్ చౌబే డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ఆయన రాజకీయాలకు పనికిరాకపోవచ్చని, అందువల్ల వేరే ఏదైనా రంగంలో ప్రయత్నిస్తే మంచిదని సలహా ఇచ్చారు. భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రధాని 'రక్తంతో వ్యాపారం' చేస్తున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు.

పార్టీకి ప్రయోజనం చేకూర్చలేని వాళ్లు, నాయకత్వ లక్షణాలు లేనివాళ్లు పార్టీలో ఉండటానికి వీల్లేదని చౌబే తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప ఎప్పుడూ లాభం లేదని, అందువల్ల ఆయనను పార్టీ నుంచి తప్పించాలని అన్నారు. అందువల్ల రాహుల్ గాంధీని రాజకీయాల నుంచి తప్పించి.. ఆయనతో వేరే ఏదైనా వ్యాపారం పెట్టించాలని చౌబే చెప్పారు.

శైలేష్ చౌబే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా సంచలనం రేపాయి. పార్టీ అగ్రనాయకత్వంపై ఇలా బహిరంగంగా విమర్శలు చేసినందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చయాలని బద్వానీ జిల్లా కాంగ్రెస్ అధ్యుడు సుఖ్‌పాల్ పర్మర్ సీనియర్ నాయకులను కోరారు.

మరిన్ని వార్తలు