మొనతేలిన కంకరరాళ్లపై పరుగుపెడుతూ..

24 Feb, 2019 10:25 IST|Sakshi

క్షతగాత్రుడిని మోసుకుంటూ 1.5 కిలోమీటర్లు!

హోషంగాబాద్‌ :  పోలీసులంటేనే కఠినాత్ములనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ వారు కూడా మనుషులే... వారికి మానవత్వం ఉందని నిరూపించుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లా పగ్ధల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్‌ బిల్లోరే అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తూ రైలు కింద నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడిని దాదాపు రెండు కిలోమీటర్ల మేర భుజంపై మోసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందించాడు. ఓవైపు భుజంపై బరువు, మరోవైపు మొనతేలిన కంకరరాళ్లపై పరుగుతీస్తూ ప్రయాణికుడికి సకాలంలో వైద్యం అందించాడు. దీంతో కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన అజిత్‌ (35) రైలులో ముంబైకి వెళుతుండగా ప్రమాదవశాత్తూ రైలు నుంచి కిందపడిపోయాడు. ప్రయాణికులు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కొండ ప్రాంతం కావడంతో అంబులెన్స్‌ అక్కడకు చేరుకోలేకపోయింది. దీంతో కానిస్టేబుల్‌ పూనమ్‌ బిల్లోరే పట్టాలపై పడివున్న అజిత్‌ను భుజాలపైకి ఎత్తుకుని 1.5 కిలోమీటర్ల దూరంలో పగ్ధల్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. మరోవైపు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’

ఆ జైలు గది కూలిపోయింది!

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలి’

దర్జాగా పరుపుపై నిద్రపోయిన పులి...

దావూద్‌ సోదరుడి కుమారుడి అరెస్ట్‌

మాయావతికి ఎదురుదెబ్బ 

అయోధ్య కేసు: సుప్రీంకు కమిటీ నివేదిక

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

కుమారస్వామి ఉద్వేగం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం