నేను చనిపోలేదు..బతికే ఉన్నా : కరోనా పేషెంట్‌

26 Apr, 2020 15:46 IST|Sakshi

భోపాల్‌ : డాక్టర్లు చేసిన పొరపాటుకు ఓ కరోనా పేషెంట్‌ స్వయంగా తాను బతికే ఉన్నా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కరోనావైరస్‌తో ఒకరు మృతి చెందితే..మరొకరి పేరును వైద్యులు ప్రకటించారు. తాను చనిపోయిన వార్తను తానే చదివి ఆశ్చర్యపోయాడు ఆ రోగి. చివరకు ఓ వీడియో రూపంతో తాను బతికే ఉన్నానని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని తెలియజేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరస్‌ కావడంతో వైద్యుల తమ పొరపాటును ఒప్పకుని క్షమాపణలు కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
(చదవండి : వ‌ధూవ‌రుల‌కు క‌రోనా, గ్రామానికి సీల్‌)

వివరాలు.. భోపాల్‌లో 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జైన్ నరగానికి చెందిన ఓ 30 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన ఉజ్జెన్‌లోని ఆర్డీ గార్డి హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అదే ఆస్పత్రిలో చేరిన ఓ 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. అయితే వైద్యులు పొరపాటున మృతి చెందిన వ్యక్తి పేరుకు బదులు చికిత్స పొందుతున్న యువకుడి పేరును మరణించినట్లు ప్రకటించారు. మరుసటి రోజు చికిత్స పొందుతున్న యువకుడు పేపర్లలో తాను మృతి చెందినట్లు వచ్చిన వార్తను చదివి ఆశ్చర్యపోయాడు. తాను బతికే ఉన్నానని, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరుతూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో వైరస్‌ కావడంతో వైద్యాధికారులు స్పందించారు. విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వైద్యులను షోకాజ్‌ నోటీసులు పంపించారు. తమ పొరపాటును గ్రహించిన వైద్యులు.. వెంటనే అతని పేరుని రికార్టులో నుంచి తొలగించి మృతి చెందిన వృద్ధుని పేరును చేర్చారు. కాగా, మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,096కు చేరింది. ఇప్పటి వరకు 99 మంది మృతి చెందారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు