కరోనా : భార్య శాంపిల్స్‌ పనిమనిషి పేరుతో.. 

12 Jul, 2020 12:46 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్‌ రాజన్‌ సింగ్‌ సింగ్రౌలీలోని ఖాతుర్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా అభయ్‌ భార్యకు కరోనా  వచ్చింది. అయితే అతడు ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో టెస్టుల కోసం భార్య నమూనాల్ని ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో పంపాడు. దీంతో అసలు విషయం ఆ తర్వాత బయటపడటంతో అభయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనా విధులు నిర్వహిస్తున్న అభయ్‌ రాజన్‌ సింగ్‌ సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో కలిసి జూన్‌ 23న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. తర్వాత రాజన్ కు‌టుంబం జూలై మొదటి వారంలో సింగ్రౌలికి తిరిగి వచ్చారు.(24 గంటల్లో.. 28వేలకు పైగా కేసులు)

అయితే ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అభయ్‌‌ భార్యకు దగ్గుతో పాటు జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం కలిగి తన భార్య నమూనాలను పనిమనిషి పేరుతో పంపాడు. ఆ శాంపిల్స్‌  పరీక్షించడంతో.. కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈ క్రమంలో పనిమనిషి పేరుతో శాంపిల్స్‌ పంపిన అడ్రస్ కు వైద్యాధికారులు, పోలీసులు వచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. కరోనా సోకింది తాను పని చేస్తున్నడాక్టర్ భార్యకని తేలింది.అభయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అభయ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.(కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన)

కాగా అధికారులు డాక్టర్‌ను కలిసిన వారందరిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో జులై 1 తర్వాత  అభయ్‌ను కలిసిన 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. వీరిలో ఒకరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు. త్వరలోనే వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. తప్పుడు పేరుతో నమూనాలు పంపినందుకు డాక్టర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. కరోనా నుంచి అభయ్‌ రాజన్‌ కోలుకున్న తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు