-

టోల్‌ఫ్లాజా ధ్వంసం, రూ.10 లక్షలు లూటీ

8 Jun, 2017 11:34 IST|Sakshi

భోపాల్‌ : ఆందోళనలు, నిరసనలతో మధ్యప్రదేశ్‌ గురువారం కూడా అట్టుడుకుతోంది. మంద్‌సౌర్‌ జిల్లాలో అయిదుగురు రైతులు మృతి చెందిన ఘటనలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉన్నా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆందోళనకారులు మంద్‌సౌర్‌ టోల్‌ఫ్లాజాపై దాడి చేశారు. అక్కడ ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా సుమారు రూ.ఎనిమిది నుంచి 10 లక్షల నగదును దోచుకు వెళ్లారు.

అలాగే మంద్‌సౌర్‌ నుంచి ఈ అల్లర్లు దేవాస్‌, నిముచ్‌, ఉజ్జయిని, థార్‌, ఖర్గోనే జిల్లాలకు పాకింది. మరోవైపు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, ఎస్పీపై బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా రైతుల మృతిపై విచారణకు ఆదేశించింది. కాగా  కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు  ఐఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రోడ్డు మార్గం ద్వారా మంద్‌సౌర్‌ పర్యటనకు బయల్దేరారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనను అనుమతించబోమని నిముచ్‌ పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు