పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం

13 Jun, 2020 10:02 IST|Sakshi

 పెట్రోలుపై కరోనా టాక్స్

 డీజిల్, పెట్రోలు పై రూ.1 పన్ను

భోపాల్: ఒక వైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు వరుసగా ఇంధన ధరలు పెంచుతోంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైంది. పెట్రోలు, డీజిల్ ధరలపై అదనంగా కరోనా  పన్ను విధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.  పెట్రోలు, డీజిల్ పై ఒక రూపాయి చొప్పున కరోనా టాక్స్ విధించింది. ఈ ధరలు నేడు (జూన్ 13)  నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .82.64, డీజిల్ ధర రూ .73.14 కు చేరింది. (ఆగని పరుగు : పెట్రో సెగ)

మరిన్ని వార్తలు